నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
బైక్ ను దొంగలించిన కేసులో బోధన్ పట్టణం అనీస నగర్ కు చెందిన షేక్ ఇల్యాస్, షేక్ సమీర్ లకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.నిజామాబాద్ నగరంలోని ముజహిద్ నగర్ నివాసుడైన మహమ్మద్ అబ్దుల్ జావీద్ 2025,ఏప్రిల్ 19 న రాత్రి తన ద్విచక్ర వాహనమైన ఆక్టివ హోండా ను ఇంటి ముందర నిలిపి లాక్ చేసి ఇంటిలో నిద్ర పోయాడు ఉదయం బైక్ కోసం చూడగా కనపడలేదు. చుట్టుపక్కల వెదికిన ఆచూకి లభించలేదు. బైక్ దొంగతనంకు గురందని బావించిన అతను నగర ఐదవ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించి నేర విచారణ చేశారు.పోలీసుల నేర విచారణలో బోధన్ పట్టణం అనీస నగర్ కు చెందిన నేరమయ విషసంస్కృతిని అలవాటు చేసుకొని జీవనం సాగిస్తున్న రియాద్, షేక్ ఇల్యాస్, షేక్ సమీర్ లు కలిసికట్టుగా బైక్ ను దొంగతనం చేశారని కోర్టులో అభియోగ పత్రం దాకాలు చేశారు. కోర్టు నేర న్యాయ విచారణలో ముద్దాయిలు అయిన షేక్ ఇల్యాస్, షేక్ సమీర్ లపై నేరం రుజువు అయినట్లు సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో నిర్దారించారు.ప్రధాన ముద్దాయి రియాద్ కేసు విచారణ ఉండగానే మృతి చెందాడు. రెండవ, మూడవ ముద్దాయిలైన షేక్ ఇల్యాస్, షేక్ సమీర్ లపై దొంగతనం కేసులో రెండు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా నాలుగు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో పేర్కొన్నారు.
