27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు  రెండు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

మోతాదుకు మించిన మద్యం మత్తులో బైక్ ను నడిపిన ఇద్ధరికి న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించారని నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21న గాంధీ చౌక్ నందు బి.రఘుపతి అధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అందులో పట్టుబడ్డ వ్యక్తి  శంకర్  ( ముగ్గుల పల్లి, బాన్సువాడ ) అను వ్యక్తి మోతాదు  (247 యంఎల్) మద్యం సేవించి  నట్లుగా తేలింది . నాందేడ్ జిల్లా బెల్కోనికి చెందిన రాజేష్  సాహెబ్ రావు(192 ఎంఎల్ ) గా వచ్చింది.  శంకర్, రాజేష్ సాహెబ్రావ్ లకు న్యాయస్థానం ముందు హాజరుపరచగా  సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్  ఇద్దరికీ 2 రోజు జైలు శిక్ష  విధించడం అయినది. వీళ్ళను కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

More articles

Latest article