నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో గల వినాయక్ నగర్ లోని పంచముఖి హనుమాన్ టెంపుల్ రోడ్ నెంబర్ 7 లోని ఓ ఇంటిపై దాడి చేశారు. నిజామాబాద్ ఇంచార్జీ సిపి సింధూశర్మ, టాస్క్ ఫోర్స్ ఇంచార్జి ఎసిపి నాగేంద్ర చారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, సీసీఎస్ సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచార ఇంచార్జీ గృహం నిర్వాహకులు, ఇద్దరు విటులు, ఇధ్దరు మహిళలు పాల్గొన్నారు. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, రూ.5900 నగదు స్వాధీనం చేసుకుని కేసు నిమిత్తం 4వ టౌన్ పోలీసులకు అప్పగించారు.
