నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ఎస్.వీరయ్య తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన బూరుడు గల్లీకి చెందిన బాచువార్ నీలేష్, ఓమూరికి చెందిన మాధవ్ కు కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు ముందు హాజరు పరుచగా మార్నంగ్ కోర్టు మెజిస్ట్రేట్ అహ్మద్ మోయినుద్దీన్ తొమ్మిది మందికి రూ.21500 జరిమానా విధించి ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
