23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

రూ.1.05 కోట్ల విలువైన మత్తు పదార్థాలు దహనం 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలోని పలు ఎక్సైజ్ పొలీస్ స్టేషన్ ల పరిధిలో పట్టుబడిన నిషేధిత గంజాయి, డైజోపాం, అల్ర్పాజోలం లాంటి రూ.1.05 కోట్ల విలువైన మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమి రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె.మల్లారెడ్డి పర్యవేక్షణలో జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌ గ్రామంలో మెడికేర్‌ సర్వీసెస్ లొ వివిధ ఎక్సైజ్‌ స్టేషన్‌ (ఆర్మూర్‌, భీమ్‌గల్‌, నిజామాబాద్‌, మోర్తాడ్‌లలో ) రూ.1.05 కోట్ల విలువైన 353 కిలోల ఎండు గంజాయి, 1.5 కిలోల డైజో ఫామ్ ,2.5 కేజీల ఆల్ఫా జలం డిస్ట్రాయ్ చేశారు. భీంగల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 8 కేసులలో 102.5 కేజీ గంజాయి, ఒక కేజీ డైజో ఫామ్, 1/2 కేజీ అల్ట్రా జలం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ మల్లారెడ్డి, ఎస్ హెచ్ఓలు స్టివేన్ సన్, గుండప్ప, దిలీప్, వేణు మాధవ్ రావులు, సిబ్బంది ఉన్నారు.

Intoxicants worth Rs.1.05 crore were burnt

More articles

Latest article