24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తె.యూ. కెమిస్ట్రీ విభాగంలో రెండు రోజుల కార్యశాల

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న “అనలైటికల్ టెక్నిక్స్ (ఏటీ-2026)” అనే రెండు రోజుల వర్క్ షాప్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.యాదగిరి రావు విడుదల చేశారు. ఈ వర్క్ షాప్‌ను ఏప్రిల్ 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సఫల ఆర్గానిక్స్ సంస్థ సీఈవో, శాస్త్రవేత్త డా. పైడి ఎల్లా రెడ్డి ప్రత్యేక ఆహ్వానిత అథిదిగా హాజరుకానున్నారు. ఈ రెండు రోజుల వర్క్ షాప్‌లో నిపుణుల లెక్చర్స్ తో పాటు ఇండస్ట్రీ సందర్శన కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రసాయన శాస్త్ర విభాగాధిపతి డా.బి. సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, డా. ఎ. నాగరాజు, డా. బాలకిషన్, డా. సునీత, డా. గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article