పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్

0 15,261
  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : పోలీసుల పేరుతో బెదరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సరంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న హ్యుందాయ్ క్రెటా కారును పోలీసులు ఆపారు. దీంతో కారు డ్రైవర్ జింక భాస్కర్ పోలీసులను చూసి పారిపోయాడు. కారులో ఉన్న నవీన్ గౌడ్, లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో చిన్న మల్లారెడ్డి శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద పోలీసులమని చెప్పి బెదిరించి ఒకరి వద్ద రూ.1,800, మొబైల్ ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.