27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చిరుతను చంపిన ఇద్దరి అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పరారీలో నలుగురు వ్యక్తులు

 

. . . నాటు తుపాకీ స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

నిజామాబాద్ జిల్లా భీంగల్ అటవీ ప్రాంతంలో చిరుతను చంపిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని, పట్టుబడిన ఇద్దరి నుంచి ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.. సీపీ కథనం ప్రకారం… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ నందు ఒక చిరుతపులిని కొందరు వ్యక్తులు హతమార్చినట్లు వచ్చిన సమాచారం మేరకు కమ్మర్ పల్లి రేంజ్ అధికారి కే అనిత, సిబ్బంది భీంగల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మలావత్ సంజీవ్, దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు అనే అనుమానిత వ్యక్తులను విచారించగా వారు ఒక చిరుత పులిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. వారిని విచారించగా కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలోని 79 కంపార్ట్మెంటులో హతమార్చిన చిరుత పులి కళేబరాన్ని దాచినట్లు తెలిపారు. కమ్మర్ పల్లి అటవీ క్షేత్రాధికారి సిబ్బందికి వారు ఆ కళేబరాన్ని భూమిలో దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించి తామే స్వయంగా తవ్వి తీసినారు. దానిని చిరుత పులి కళేబరంగా గుర్తించారు అటవీశాఖ అదికారులు. మాలావత్ సంజీవ్ అనే వ్యక్తి భీంగల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి. సుమారు ఒక నెల రోజుల క్రితం మేకల మందను కారేపల్లి అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లగా ఒక ఆడమేకను చిరుత పులి హతమార్చింది. ఈ విషయాన్ని తన గ్రామంలోని ఇతర వ్యక్తులకు తెలపగా ఈ విషయాన్ని తెలుసుకున్న దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు చిరుత పులి తిరిగి ఆ కళేబరం దగ్గరికి వస్తుందని దాన్ని చంపి దాని శరీర భాగాలను అమ్ముకుంటే లక్షల్లో డబ్బు వస్తుందని మాలావత్ సంజీవ్ కు ఆశ చూపినాడు. ఆ రాత్రి మలావత్ సంజీవ్ తన గ్రామానికి చెందిన ఇతర నలుగురు వ్యక్తులతో కలిసి ఆ కళేబరంలోకి గడ్డి మందును సిరంజి ద్వారా ఎక్కించినారు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతానికి నిందితులు వెళ్లి చూడగా చిరుత పులి చనిపోయి ఉంది. ఈ విషయాన్ని మలవత్ సంజీవ్ సిరిసిల్ల రాములు ఇతర నలుగురు వ్యక్తులకు తెలిపినాడు. వారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ కళేబరాన్ని దాచిపెట్టి సరైన కొనుగోలుదారుడు దొరికిన తర్వాత దానిని తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. విచారణలో భాగంగా సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా దాచిన ఎటువంటి ఆయుధ లైసెన్స్ లేని ఒక నాటు తుపాకీ దొరికినది. దానిని అటవీశాఖ అధికారులు తదుపరి విచారణ కొరకై భీంగల్ పోలీసులకు అప్పగించినారు.ఉద్దేశపూర్వకంగా వన్యప్రాణి అయినా చిరుత పులిని చంపిన నేరానికి గురువారం ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఇతర నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు .వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022 ,తెలంగాణ అటవీ చట్టం ,జీవవైవిద్య చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. నిందితులను ఆర్మూరు న్యాయస్థానంలో హాజరు పరచడం జరుగుతుందని సీపీ తెలిపారు..

More articles

Latest article