29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ఫాం నింపేలా చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ఫారం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశించారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎస్ఐఆర్ అంశంపై మండల అధ్యక్షులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల పూర్తి వివరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపించాలని సూచించారు. పాత ఓటరు వివరాలు లేదా 2002 ఓటరు జాబితాను ఆధారంగా తీసుకుని వివరాలను సక్రమంగా పరిశీలించి అప్‌డేట్ చేయాలని అధికారులకు, సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.  ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గంలో 70 నుంచి 80 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న బీఎల్ఓ లు, సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సమావేశంలో మండల అధ్యక్షులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Measures must be taken to ensure every voter fills out the SIR form.

More articles

Latest article