నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మార్కెట్ యార్డులో బుధ, గురువారాల్లో పసుపు పంట తుకాలు యధావిధిగా కొనసాగుతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ తెలిపారు. సోమ, మంగళవారాల్లో అమ్మకాల నిమిత్తం మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున పసుపు పంట నిల్వలు వచ్చాయని అన్నారు. బిడ్డింగ్ పూర్తయిన లాట్లకు బుధ, గురువారాల్లో తూకాలు జరుగుతాయని, బిడ్డింగ్ కాకుండా మిగిలిపోయిన పసుపు నిల్వలకు బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
