నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని సుభాష్ నగరో లోగల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు టీయూఎఫ్ఐడీసీ కింద డివిజన్ కి కోటి రూపాయల చొప్పున మంజూరు అయినా నిధుల పెండింగ్ విషయం గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇంచార్జి మంత్రి స్పందించి 2023 మార్చ్ పెండింగ్ లో ఉన్న టీయూఎఫ్ఐడీసీ లో 38 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో డివిజన్ల అభివృద్ధికి మంజూరు చేశామన్నారు. టీయూఎఫ్ఐడీసీ కింద విడుదల అయినా నిధులను డివిజన్లో రోడ్స్, డ్రైనేజీ పనులు పక్షికంగా, అసంపూర్తిగా జరిగిన పనులను పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజా ఉపయోగం లోకి తీసుకురావాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలనీ అన్నారు. నగరంలో రోడ్ మరమ్మతులు జరగడం లేదని గుంతలు పడ్డ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నగరంలో గుంతలు పుడ్చాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ శ్రీమాన్ నారాయణ, డీఈ ప్రవీణ్, మునిసిపల్ డీఈ రషీద్, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

