26.3 C
Hyderabad

పసుపు బోర్డు కార్యదర్శికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ శుక్రవారం  నిజామాబాద్ కు   మొట్టమొదటి సారిగా అధికారిక  పర్యటన కు వచ్చిన సందర్భంగా తెలంగాణా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా  మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించింది. నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కోరిక ,రైతుల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని , పసుపుకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సెక్రటరీని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కె. రామ్మోహన్ రావు, ఈవియల్ నారాయణ, ఎస్.ప్రసాదరావు, లక్ష్మీనారాయణ లావు వీరయ్య, డి చక్రపాణి హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ (హైదరాబాద్) తదితరులు ఉన్నారు.

More articles

Latest article