నిజామాబాద్, బతుకమ్మ: భీమాకోరేగావ్ విజయ్ దివస్ స్పూర్తితో బహుజనులకు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో భీమా కో రేగావ్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడారు.
1818 జనవరి ఒకటిన, మహారాష్ట్రలోని పూణే జిల్లాకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని భీమా నది ఒడ్డున ఉన్న కోరేగావ్ గ్రామంలో
500 మంది బహుజన జాతుల (మహార్) సిపాయిలకు, 28 వేల మంది పీష్వా బాజీరావు దోపిడీ సైన్యాలకు మధ్య జరిగిన యుద్ధంలో
28 వేల మంది పీష్వా సైనికులను
కేవలం ఐదు వందల మంది (మహార్) బహుజన శ్రామిక జాతుల వీరసైనికులు తుదముట్టించారని తెలిపారు.
ఈ యుద్ధంలో 47 మంది బహుజన వీరులు వీరమరణం పొందితే
వారి జ్ఞాపకార్థంగా విజయ్ స్తంభం నిర్మించారన్నారు.
1928లో మొదటి సంస్మరణ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వం ఇక్కడ జరిగిందని తెలిపారు. ఈచరిత్రను మహాత్మా జ్యోతిబా ఫూలే అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, బీఎల్ టీయూ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్లా,
బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు టి.సంజయ్, జిల్లా కార్యదర్శి బాలు, జిల్లా నాయకులు డి.పోశెట్టి, టి.బాబు తదితరులు పాల్గొన్నారు.
భీమా కో రేగావ్ అమరవీరులకు నివాళులు
