పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి నివాళులు

0 1,251

నిజామాబాద్, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం నిజామాబాద్ జిల్లా పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ నాయకులు మాట్లాడారు.  దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆర్థికవేత్తగా అయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో మేలు చేశాయని కొనియాడారు .ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షులు పొద్దుటూరు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్, మాజీ ప్రధాన కార్యదర్శి జలంధర్, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు సరిత, నందిపేట్ మండల అధ్యక్షులు భూషణ్, ప్రధాన కార్యదర్శి జీడి రమేష్, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు కొండ రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, బాల్కొండ మండల అధ్యక్షులు వేల్పురి శ్రీనివాస్, ఇందల్వాయి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వివిధ మండలాల రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.