నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లిన పోరాట యోధులు వుల్సే రాజేశ్వర్, పుప్పాల రాజేందర్, భూసాని గోవర్ధన్, చెలివేలి శ్రీధర్ ను బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేళీ పోటీ చేసి గెలవడం జరిగిందని తెలిపారు. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ ఎన్నికలో గెలిచెందుకు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం పాల్పడ్డారు అని ఆరోపిస్తు అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారని తెలిపారు. ఈ కేసు 4 సంవత్సరాలు విచారించడం జరిగింది.1975 జూన్ 12 నా తీర్పు రావడం జరిగింది ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలువడం కొరకు అధికారిక దుర్వినియోగం పాల్పడింది ఆమె ఎన్నిక చెల్లదు అంటు, అంతే కాకుండా ఆమె 6 ఏళ్ళ పాటు ఏ ఎన్నికలో పోటీ చేయదు అంటు నిషేధం విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు దేశంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి డిమాండ్ చేయడం జరిగింది. తన ప్రధాన మంత్రి పదవి, అధికారం ఎక్కడ పోతుందో అని జూన్ 25 1975 నా అర్థరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం కానీ ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ డే వాళ్ళ భారతదేశ ప్రజాస్వామ్యా చరిత్రలో ఒక చీకటి దినం అయింది. అంతర్గత భద్రత కారణంగా చూపి అధికారాన్ని అంటిపెట్టుకోవాలి ఉద్దేశంతో ఎమర్జెన్సీ డే విధించడం జరిగింది. ఈ యొక్క ఎమర్జెన్సీ 1975 నుంచి 1977 వరకు దాదాపుగా 21 నేలలు విధించడం జరిగింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మానవహక్కుల మంటలో కలిపి, ప్రజలను దారుణంగా హింసించడం జరిగింది. ఎమర్జెన్సీ విధించిన వెంటనే ప్రతి పక్షనేతలు అయినా అటల్ బిహారీ వాజపేయిని, అద్వానీని, మొరార్జీ దేశాయ్ ని ఎటువంటి వారెంట్ లేకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొతన్ కార్ లక్ష్మి నారాయణ, నగ్గొల్ల లక్ష్మి నారాయణ, శివప్రసాద్, పంచరెడ్డి ప్రవళిక, కొండా ఆశన్న, ఇప్పాకాయల కిషోర్, కోడూరు నాగరాజు, తారక వేణుగోపాల్, పద్మా రెడ్డి, సందీప్, మాస్టర్ శంకర్, జగన్ రెడ్డి, పడల భూపతి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.