Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 12:47 pm Posted by : ramakrishna

అనంతగిరి ఘాట్ రోడ్ లో ట్రావెల్స్ బస్సు బోల్తా

 

… ముగ్గురు మహిళలు దుర్మరణం

…  క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలింపు

 వికారాబాద్, బతుకమ్మ:

వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి ఘాట్ రోడ్ లో ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు  మృతి చెందగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగినప్పుడు స్థానికులు సత్వరం స్పందించడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారిస్తున్నారు.

Travels bus overturns on Ananthagiri Ghat Road
Travels bus overturns on Ananthagiri Ghat Road