నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ పర్యావరణ పై అవగాహనా దినోత్సవకార్యక్రమలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ లో ని నిజామాబాదు రైల్వే స్టేషన్ లో ఆదివారం వైద్యధికారిని దీప ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణం పై వాటి దుష్ప్రభావం మీద ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సీసా లలో నీరు వినియోగించటం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలపై రైల్వే వైద్యదికారిని దీప ప్రయాణికులకు అవగాహనా కల్పించారు. ప్రయాణికులు తమ వెంట ప్లాస్టిక్ రహిత మంచినీటి సీసాలు తీసుకుపోవాలి అని సూచించారు. హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్ మాట్లాడుతూ ప్రయాణికులు ప్లాట్ఫారం పై వున్న చెత్త కుండీలను వ్యర్థ పదార్ధములు వేయడానికి ఉపయోగిoచాలని సూచించారు. అనంతరం అవగాహనా నిమిత్తమ్ ప్రయాణికులకు స్టీల్ వాటర్ బాటిల్స్ ను ఉచితం గా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి దీప, స్టేషన్ మేనేజర్ సదా శివుడు, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చంద్ర శేఖర్ , రైల్వే రక్షక దళ సిబంది తదితరులు పాల్గొన్నారు.

