24.8 C
Hyderabad
Friday, July 31, 2026

పారదర్శకంగా చేప పిల్లల పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే పై మండిపాటు
  • జిల్లా ఫిషర్ మెన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల సంక్షేమం కోసం వారికి ఆర్థికంగా చేయూతని అందించడానికి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తుందని జిల్లా ఫిషర్ మన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం పై, గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఖండించారు. గత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో కోట్ల రూపాయలు గత ఎమ్మెల్యేలు తమ జేబుల్లోకి మలుచుకున్నారని ఆరోపించారు. ఆర్సపల్లి లో వున్న గంగాపుత్రుల భూమి అన్యక్రాంతానికి గురికవడానికి కారణం బిఆర్ఎస్ ఎంఎల్ఏ లు అని, దానిని జిల్లా గంగపుత్రులు గ్రహించి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగిందని, బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డిఆదేశాల మేరకు కలెక్టర్ ని కలిస్తే వారు సర్వే చేయించడం వల్ల 4 ఎకరాల 24 గంటల భూమి మస్త్య కరులకు చెందుతుందని కలెక్టర్ గారు సూచనలు ఇచ్చారు. అధికారం లేకపోవడం వల్ల మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న ప్రశాంత్ రెడ్డికి తగ్గిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది అని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేకుంటే దిష్టి బొమ్మ దహనం చేస్తామని హెచ్చరించారు. గంగాపూత్రులకు ఇతర కులస్తులకు చిచ్చు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రమోటర్ శ్రీనివాస్,అన్నయ్య శ్రీనివాస్,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article