. ఓ చోటు నుంచి ట్రాన్స్ ఫర్
. మరో చోటు నుంచి రిలీవింగ్ ఆర్డర్
. తప్పిదాలు చేస్తున్నదెవరు?
నిజామాబాద్, బతుకమ్మ: బదిలీల్లో భాగంగా ఓ ఉద్యోగి జూలై 18న కౌన్సిలింగ్ లో ఆప్షన్ తీసుకుని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి కామరెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో అదే నెల 21న సూపరింటెండెంట్ గా విధుల్లో చేరారు. మళ్లీ అదే ఉద్యోగి జూలై 27న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి సిద్ధిపేటకు బదిలీ అయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అదికారి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉద్యోగికి కామారెడ్డి మెడికల్ కళాశాల నుంచి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఓ ఉద్యోగిని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి కామారెడ్డి వైద్య కళాశాలకు జూలై 18న బదిలీ చేశారు. ఆయన అదే నెల 21న వైద్య కళాశాలలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా విధుల్లో చేరాడు. అదే నెల 27న సదరు ఉద్యోగి.. రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సిద్ధిపేటకు బదిలీ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పటికే సదరు ఉద్యోగి ప్రభుత్వ వైద్య కళాశాలలో వారం రోజులపాటు విధులు నిర్వర్తించారు. మళ్లీ బదిలీ ఉత్తర్వులు వెలువడగానే సిద్ధిపేటలో విధుల్లో చేరారు. అతనికి ఇచ్చిన ఉత్తర్వులు మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్దిపేటకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి నుంచి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి సిద్దిపేటకు ఉత్తర్వులు రాగా కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిద్దిపేటకు రిలీవ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగితోపాటు ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి ఇద్దరూ తప్పిదం చేశారు. ఇంత నిర్లక్ష్యం జరిగినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని వైద్యారోగ్యశాఖాధికారులు గుసగుసలాడుతున్నారు.

