27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మల్టి జోన్ 1 లో 13 మంది సర్కిల్ ఇన్స్ పెక్టర్ల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

. . . నిజామాబాద్ కమీషనరేట్ లో ఐదుగురికి స్థాన చలనం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 రాష్ర్టంలో మల్టిజోన్ 1  లో పని చేస్తున్న 13 మంది సర్కిల్ ఇన్స్ పెక్టర్లను బదిలీ చేస్తు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని ఐదుగురు సిఐలకు స్థాన చలనం కలిగిస్తు బుదవారం రాత్రి అదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ పిసిఆర్ లో పనిచేస్తున్న బుక్క శ్రీనివాస్ కు నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ గా పోస్టింగ్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ సతీష్ కుమార్ ను ఐజీ కార్యలయంకు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఐజీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పతంగి సత్యనారాయణకు  ఆర్మూర్ ఎస్ హెచ్ఓగా నియమించారు. అర్మూర్ ఎస్ హెచ్ఓ గా ఉన్న వి . రవి కుమార్ ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని కోరారు. రూద్రుర్ సిఐ  కే. జయేష్ రెడ్డి ని కుడా ఐజి కార్యాలయంలో ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిపొర్టు చేయాలని సూచించారు. ఐజి కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రెడ్డ బోయిన క్రిష్ణకు రూద్రూర్ సర్కిల్ సిఐగా పోస్టింగ్ ఇచ్చారు.నిజామాబాద్ టాస్క్ పోర్స్ లో పని చేస్తున్న కే పురుషోత్తం కు రామాగుండం ట్రాపిక్ పిఎస్ 1 ఎస్ హెచ్ఓగా నియమించారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఐదుగురు సిఐలను ఐజి కార్యాలయంకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడం చర్చనీయంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఇటివల వెలుగు చూసిన ఇసుక దందాలో ఖాకీలకు ప్రతి నెల మామూళ్ల నేపథ్యంలో కోందరు సర్కిల్ కు పోస్టింగ్ ఇవ్వలేదని అదే మాదిరిగా రెపోమాపో 9 మంది ఎస్ఐలకు కుడా స్థాన చలనం కలిగించే అవకాశం ఉన్నట్టు పోలిసు వర్గాల బోగట్టా.

Transfer of 13 Circle Inspectors in Multi Zone 1

More articles

Latest article