ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల ఆయిల్ పామ్ రైతులకు ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్తంగా వేసవి కాలం పంట నిర్వహణ గురించి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మండలంలో 130 ఎకరాల్లో పంట కోతకు వచ్చిందని ఇప్పటివరకు 39 మంది రైతులకు 57 టన్నులకు 11,86,723 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆయిల్ పామ్ పంటలో వేసవిలో తీసుకోవాల్సిన వివిధ జాగ్రత్త లు వాటి గురించి రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, గుమ్మి ర్యాల గడ్డం లింగారెడ్డి, గుండెటీ శేఖర్, కొప్పేల మారుతి రెడ్డి, మండల రైతులు పాల్గొన్నారు.
