ఆయిల్ ఫామ్ గ్రామ రైతులకు శిక్షణ
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండల ఆయిల్ పామ్ రైతులకు ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్తంగా వేసవి కాలం పంట నిర్వహణ గురించి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మండలంలో 130 ఎకరాల్లో పంట కోతకు వచ్చిందని ఇప్పటివరకు 39 మంది రైతులకు 57 టన్నులకు 11,86,723 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా...