25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండో రోజు కొనసాగిన శిక్షణ తరగతులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి అశోక్ పర్యవేక్షణలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులార్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కో ఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్ రావ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను డీఈవో అశోక్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ బలరాం నాయక్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (డీఆర్పీ)లు, మురళి, మమత, ప్రకాష్, రాజన్న రెండో రోజు శిక్షణ తరగతులను కొనసాగించారు. దివ్యాంగ విద్యార్థులకు సాధారణ తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు విద్యా బోధనపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ ప్రత్యేక ఉపాధ్యాయులు, ఇక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్  (ఐఈఆర్పీ)పాల్గొన్నారు.

More articles

Latest article