బతుకమ్మ,మోర్తాడ్: ఏర్గట్ల, మోర్తాడ్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. మాస్ లైన్ ప్రజా పంత ఎర్గట్ల, మోర్తాడ్ మండలాల సంయుక్త కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ మోర్తాడ్ మండలంలోని ధోన్ పాల్ గ్రామంలో 1994 సంవత్సరంలో ఇందిరమ్మ పథకం కింద సర్వే నెంబర్ 222 లో 80 ప్లాట్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చినార. కానీ ఇంతవరకు ఎవరికి ప్లాట్లు చూపించలేకపోయారని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకపోయినా పట్టించుకున్న దాఖలు లేవని ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఆనాడు ఇచ్చిన 222 సర్వే నెంబర్ లో ఇల్లు కట్టి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో లబ్ధిదారులు తిగుళ్ల గంగ, పోసాని, తిగుళ్ల భూమ గంగు, జమున, సాయమ్మ, గుండ్ల లక్ష్మి, గుండ్ల బాజామ్మ , దూదేకుల మొగుల సాబ్, డోన్ పాల్ సాయమ్మ , ధోన్ పాల్ రాజు, ధోన్ పాల్ గంగాధర్, సురేష్, తిగుల్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
