- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలకు తాత్కాలిక డైవర్షన్ అమలు చేయబడుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవలసిందిగా కోరారు. డైవర్షన్ సమయంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఇచ్చే సూచనలు, సలహాలను పాటించి పోలీసు శాఖకు సహకరించాలని వాహనదారులను కోరారు.
- డైవర్షన్ పాయింట్లు:
హైదరబాద్ నుండి పొందుర్తి మీదుగా కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనదారులు సిరిసిల్ల బైపాస్ రోడ్ ద్వారా పట్టణంలోకి ప్రవేశించవచ్చని తెలిపారు. సిరిసిల్ల రోడ్ నుండి నిజాంసాగర్ వైపుగా వెళ్ళే వాహనాలు రైల్వే స్టేషన్/ ఇందిరా చౌక్ – పాత బస్టాండు – పంచముఖి హనుమాన్ ఆలయం – రైల్వే గేటు- అశోక్ నగర్ మార్గంగా వెళ్లవచ్చని తెలిపారు. కొత్త బస్టాండు నుండి ఎల్లారెడ్డి వైపు వెళ్లే వాహనాలు మున్సిపల్ ఎదురుగా ఉండు రోడ్ ద్వారా పాత సాయిబాబా ఆలయం – దేవునిపల్లి గ్రామపంచాయతీ – భగత్‌సింగ్ విగ్రహం మార్గం ద్వారా వెళ్లవచ్చన్నారు. కొత్త బస్టాండు నుండి హైదరబాద్ వైపు వెళ్లే వాహనాలు నిజామాబాద్ వైపు వెళ్ళు దారిలో టెక్రియాల్ బైపాస్ రోడ్ మరియు ఎన్ఎచ్-44 మార్గంగా వెళ్లాలని తెలిపారు.
