29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నిశ్వార్థపరులను విమర్శించడం బాధాకరం

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : అది ఉద్యమం నుండి ఇప్పటిదాకా అధినేత కేసీఆర్ వెంట ఉండి నిస్వార్థ, నిర్వీరామంగా కృషి చేసిన హరీష్ రావు, సంతోష్ కుమార్ లపై విమర్శ చేయడం బాధాకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత 25 యేండ్లుగా ఉద్యమం అయిన, పాలన అయిన ఏదైనా తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిర్వీరమంగా కృషి చేసిన హరీష్ రావు, అది నుండి ఇప్పటిదాకా కేసీఆర్ వెన్నంటి ఉంటూ పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన జోగినపల్లి సంతోష్ కుమార్ లను విమర్శించడం ఘోరమని అన్నారు.  పార్టీ కోసం పని చేసిన వ్యక్తుల మీద,  ఆకారణంగా వారి వ్యక్తిత్వం మీద, వారి కమిట్మెంట్ మీద విమర్శలు చేయడం బాధాకరమని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

More articles

Latest article