27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం సందర్శించి ప్రత్యేక అభిషేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు.

 

TPCC President performs special prayers at Umamaheswara Temple.

 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‌కు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నగేష్ రెడ్డి, కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

 

TPCC President performs special prayers at Umamaheswara Temple.

More articles

Latest article