28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆంజనేయ స్వామి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

TPCC President performs special prayers at Anjaneya Swamy temple.

More articles

Latest article