27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జూలై 25న అరుణోదయ నాగన్న సంతాప సభ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విజయవంతం చేయాలని ప్రజాసంఘాల పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అరుణోదయ నాగన్న సంతాప సభను ఈ నెల 25న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో, సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో పీడీఎస్ యు, పీవైఎల్, పీఓడబ్య్లూ, ఐఎఫ్ టియు, ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో నాగన్న సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య, పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం, ఐఎఫ్ టియు జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, పీఓడబ్ల్యూ నగర ప్రధాన కార్యదర్శి సంజన పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అరుణోదయ నాగన్న సుదీర్ఘకాలం ప్రజా గొంతుకగా నిలిచి ప్రజా సమస్యలపై అనేక పాటలు, రచనలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు ఆయన గళం విశేష బలాన్ని చేకూర్చిందని, చివరి వరకు ప్రజల మనిషిగా జీవించారని కొనియాడారు. జూలై 25న నిర్వహించనున్న సంతాప సభలో నాగన్న సాహిత్యం, ప్రజా ఉద్యమాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకోవడంతో పాటు, ఆయన ఆశయాల స్ఫూర్తితో భవిష్యత్తు ప్రజా ఉద్యమాల నిర్మాణంపై చర్చిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పవన్ కుమార్, మనోజ్, శంకర్, దాసు, రాజు, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article