. . . ఏసీపీ గా పదోన్నతి పొందటం పట్ల హర్షం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీ శైలం ఇటీవల ఏసీపీగా పదోన్నతి పొందిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఏసీపీగా పదోన్నతి పొందిన సదరు అధికారిని ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.