24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రామయ్యకు పర్యాటక శోభ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్,(మోర్తాడ్):  గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద ప్రవాహం అధికంగా రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తోనికి సలాడుతుంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్ట్ 41 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేయడంతో ఆ అందాలను వీక్షించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఫలితంగా ఎస్సారెస్పీ పర్యాటక శోభను సంతరించుకుంది. స్థానిక నిజామాబాద్ జిల్లా వాసులే కాకుండా నిర్మల్, కోరుట్ల, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి జలదృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. యువకులు తమ చరవానిలో సెల్ఫీ దిగుతు సంతోషం వ్యక్తం చేశారు. జల దృశ్యాలను తమ కెమెరాలో బంధిస్తున్నారు.

More articles

Latest article