26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మొక్కజొన్న పంటలో కలుపు నివారణకు టోరీ సూపర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రం రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్టిసైడ్ కంపెనీ  ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో టోరీ సూపర్ అనే కొత్త గడ్డి మందును రైతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ టోరీ సూపర్ అనే గడ్డి మందును మొక్కజొన్న లో పిచికారి చేయడం వలన అన్ని రకాల గడ్డి జాతుల మొక్కలు చనిపోవడం జరుగుతుంది అని అన్నారు. మొక్కజొన్న పంటలో గడ్డి మందులు పిచికారి చేసే సమయంలో కలుపు మందు కలుపుకునే విధానం కూడా మార్కెట్లో దొరికే వివిధ మందులతో పోలిస్తే చాలా సులువుగా కలుపుకోవచ్చు అని రైతులతో అన్నారు.  ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏరియా మేనేజర్ ఎం నరేష్ మాట్లాడుతూ ఈ మందు ఎకరానికి 600 గ్రాములు చొప్పున ఒక ఎకరానికి వాడుకోవాలని గడ్డి మందులు పిచికారి చేసే సమయంలో తీసుకోవాలి జాగ్రత్తలు, సూచనలు రైతులకు, క్లుప్తంగా తెలియజెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ బ్రాండ్ ఇన్ఫెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మేనేజర్ నరేష్ , సీనియర్ సేల్స్ ఆఫీసర్ రాజశేఖర్ గౌడ్, కంపెనీ ప్రతినిధులు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article