29 C
Hyderabad
Monday, August 3, 2026

బియ్యం లారీ పట్టారు.. వదిలేసారు..

Must read

📰 Generate e-Paper Clip

మూడు గంటలు రోడ్డుపైనే లారీ !

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల పరిధిలోని ధర్మారం టోల్ ప్లాజా వద్ద ఆదివారం కమర్షియల్ టాక్స్ అధికారులు ఒక లారీని పట్టుకొని సుమారుగా మూడు గంటలసేపు లారీని రోడ్డుపైనే ఉంచారు. సామాన్యంగా లారీలను తనిఖీ చేస్తున్న సమయంలో బియ్యం లోడుతో వెళ్తున్న లారీని ఆపారు. ఈ బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నా యి అనేది తెలుసుకొని, దానికి సంబంధించిన పత్రాలను పరిశీలించి కరెక్ట్ గా ఉంటే ,లారీని వదిలివేయవలసి ఉండ గా,  కనీసం లారీలో ఏ బియ్యం ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయా, సన్న బియ్యం ఉన్నా యా అనేది కూడా పరిశీలించకుండా రోడ్డుపైనే సుమారు మూడు గంటల సేపు వేచి ఉంచడం వెనక మతలబు ఏందో అర్థం కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ టాక్స్ అధికారులు లారీలను తనిఖీ చేస్తే లారీకి సంబంధించిన పత్రాలు సరిగా ఉన్నాయా లేదా పరిశీలించి సరిగా ఉంటే వదిలివేయాలి. లేదా దానికి సంబంధించిన టా క్స్ కట్టారా, లేదా చూసుకొని జరిమానా విధించి వదిలివేయవలసి ఉంటుంది. ఈ విషయమై ఏసీటీవో అధికారి కుశుడును వివరణ కోరగా.. లారీల తనిఖీలో భాగంగా లారీని పట్టుకోవడం జరిగిందని ,ఈ లారీ ఆంధ్ర నుండి రాజస్థాన్ కు వెళ్తుందని ,ఈ లారీలో బియ్యం ఉన్నాయని, అట్టి బియ్యాన్ని తనిఖీ చేసే అధికారం మాకు లేదని, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వాలని, మేము కేవలం లారీకి సంబంధించిన వపత్రాలు ఉన్నాయా, లేదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాక్స్లు కట్టారా లేదా అనేది పరిశీలిస్తాం, తప్ప లారీలో ఎలాంటి రవాణా జరిగిన మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ సిటీవో కార్యాలయంలో పనిచేస్తున్న క్లర్క్ వసంత్ కుమార్ ఇష్ట రీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో మాసన్పల్లి వద్ద ఇలాగే ఒక లారీని ఆపి వేచి ఉంచారనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అసలు ఏం జరుగుతుందో నిర్ధారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

More articles

Latest article