రేపు మున్నూరు కాపు విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానం

0 8,751

 

.   .   . ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర చైర్మన్ మున్నూరు కాపు కార్పొరేషన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

 

తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ఏటా  పదో తరగతి, ఇంటర్మీడియట్,ఈపీసీఈటీ, జెఈఈ అడ్వాన్స్ లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రతిభ పురస్కారాలు సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 7న ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ మున్నూరు కాపు కార్పొరేషన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ హాజరై పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి యేడాదిలాగే ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.ఇప్పటికీ పలువురు విద్యార్థిని విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వారితో పాటు ఈసారి క్రీడారంగంలోనూ సత్తాను చాటిన వారికి సైతం సత్కారం అందించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం 2025-26లో క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన వారు తమ వివరాలను జిల్లా కమిటీకి అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు  నిజామాబాద్ మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ , రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు డాక్టర్ బాల శ్రీనివాస్ పటేల్,   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటియాల వెంకట కిషన్ పటేల్ లు హాజరుకానున్నట్లు తెలిపారు.  కావున నిజామాబాద్ పట్టణం, జిల్లాలోని మున్నూరు కాపు  ఉద్యోగులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇప్పటికీ పేరు నమోదు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో విచ్చేసి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరారు. ఇతర వివరాలకు అధ్యక్షులు తోట రాజశేఖర్ పటేల్ 9440815010, ప్రధాన కార్యదర్శి 9440533422, కోశాధికారి బాశెట్టి సురేష్ కుమార్ పటేల్ 9849004942కు సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.