27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

స్కానింగ్ మిషన్ వాడాలంటే ఎన్ వోసీ సర్టిఫికేట్ తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

వైద్యులు స్కానింగ్ మిషన్ కొనదలిస్తే వారు ముందుగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్వో కార్యాలయంలో డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన గర్బస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ పిసిపిఎన్డిటి లో నమోదు అయినా వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని, నమోదు కానీ వైద్యులు స్కానింగ్ మిషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేయరాదని తెలిపారు. ఎవరైనా స్కానింగ్ మిషన్ కొంటే వారు ఫార్మ్ బి సర్టిఫికెట్ లో కొత్త స్కానింగ్ మిషన్ వివరాలు, అలాగే దానిని ఉపయోగించే వైద్యుని వివరాలు ఉండాలని తెలియజేశారు. అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్లను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి, ఒక ఆసుపత్రి నుండి ఇంకో ఆసుపత్రికి బదలాయించడం కూడా నేరమని, ఇలా చేస్తే సంబంధిత వ్యక్తులపై టి సి పి ఎన్ డి టి చట్టం, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తి కి పాల్పడినట్లయితే వారిపై ఎంటిపి చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. పి సి పి ఎన్ డి టి, ఎంటిపీ చట్టాలను ఉల్లంఘించడం ద్వారా సమాజంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి తగ్గిపోతున్నదని, పుట్టబోయే శిశువు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు రేడియాలజిస్ట్ డాక్టర్ శ్వేత, గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభావతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమలత, స్వచ్ఛంద సేవ మహిళా సంఘం నుండి పద్మాసింగ్, డి హెచ్ ఈ వేణుగోపాల్, హెచ్ ఇ ఓ సురేష్ పాల్గొన్నారు.

More articles

Latest article