30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిస్ సoగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిస్ సoగ్వాన్ సూచించారు.  జిల్లా కలెక్టర్ ఆశిస్ సoగ్వాన్ బాల సదన్ కామారెడ్డిని బుధవారం సందర్శించారు. బాలసదనంలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. పిల్లలతో మాట్లాడి సౌకర్యాలు కనుక్కున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వర్షాకాలం దృష్ట్యా దుప్పట్లు పంపిణీ చేశారు. దాతలు ఎవరైనా వారి పుట్టినరోజులకు, పండగలకు లేదా ముఖ్యమైన రోజులలో బాలసదనంకు వచ్చే పిల్లలతో సమయం గడపాలని కోరారు. కొత్త భవనం యొక్క కన్స్ట్రక్షన్ గురించి కాంట్రాక్టర్ తో, పిఆర్ డిపార్ట్మెంట్ వారితో ఆరా తీశారు. త్వరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి  ప్రమీల, దయానంద్ గజిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి సుపరిండెంట్ సంగమేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.

To be in a higher position in the future

More articles

Latest article