27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుని పెళ్లి రోజు వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుమకమ్మ : జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ పెళ్లిరోజు వేడుకలను జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సారంగపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ తెలిపారు. అనంతరం నగరంలో గల మానవతా సదన్ నందు గల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పుస్తకాలు, పండ్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీఓ కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, మాజీ  జిల్లా కోశాధికారి గంధం వెంకటేశ్వర్లు, టీఎన్జీవో నిజామాబాద్ అర్బన్, రూరల్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, జ్ఞానేశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

TNGO State President's Wedding Day Celebrations

More articles

Latest article