నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ప్రవీణ్ మామిడాలను నియమిస్తూ శనివారం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ గతంలో బయోటెక్నాలజీ విభాగాతిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్ గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్ రిలేషన్స్, ఐక్యూ ఎసి, యూజీసి విభాగలకు డైరెక్టర్ గా విధులు నిర్వహించారు.
- తెయూ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కే.సంపత్ కుమార్
తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య. కే.సంపత్ కుమార్ నియమితులయ్యారు. ఆచార్య కే.సంపత్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో ఆచార్యులుగా కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో అప్లైడ్ స్టాటిసిక్స్ హెడ్ గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్,చైర్మన్గా, పిఆర్ఓగా, నోడల్ ఆఫీసర్గా పరీక్షల నియంత్రణ అధికారిగా వైస్ ప్రిన్సిపాల్ గా, పబ్లికేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.
