27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బస్సును ఢీకొన్న టిప్పర్ : 15 మంది మృతి

Must read

📰 Generate e-Paper Clip

తాండూరు, బతుకమ్మ:  తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. ఈఘటన హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ తో పాటు 14 మంది అక్కడికక్కడే మరణించారు. లారీలో ఉన్న కంకర బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈఘటనలో పలువురికి తీవ్రగాయలయ్యాయి. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి నగరానికి వస్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. దీంతో చేవెళ్ల- వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయి వాహనాలు నిలిచిపోయాయి.

More articles

Latest article