బస్సును ఢీకొన్న టిప్పర్ : 15 మంది మృతి

తాండూరు, బతుకమ్మ:  తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. ఈఘటన హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ తో పాటు 14 మంది అక్కడికక్కడే మరణించారు. లారీలో ఉన్న కంకర బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈఘటనలో పలువురికి తీవ్రగాయలయ్యాయి. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో...