27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Must read

📰 Generate e-Paper Clip

జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్

22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు

నిజామాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (2024-25 విద్యా సంవత్సరం) పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. మే 22వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్ మెంటల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  జిల్లా కలెక్టర్, అడిషనల్  కలెక్టర్  ఆధ్వర్యంలో ఇదివరకే అన్ని విభాగాల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించమన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీ.సీ. కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ అధికారులు కచ్చితంగా నియమ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు.  ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని అన్నారు.రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు  జిల్లాలో 36 సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి, మరుగుదొడ్లు, వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య సేవలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా  ఫర్నిచర్ ను సమకూర్చుకోవాలని, అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ లను నియమించి వారికి శిక్షణ ఇచ్చే బాధ్యత సీఎస్, డీవో లదే అన్నారు. కాపీయింగ్ జరగకుండా పరీక్ష ప్రారంభం కు ముందుగానే విద్యార్థులను తనిఖీ చేసి పంపాలన్నారు.

హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకుని హాజరు కావచ్చు…

విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్ సైట్ అప్ లోడ్ చేశామన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాల ల ప్రిన్సిపాల్ లు హాల్ టికెట్ లు ఇవ్వకపోయినా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని స్పష్టం చేశారు. విద్యార్థుల ను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా, స్టాంపు లేకపోయినా సీఎస్, డీవోలు వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్యకనకమహాలక్ష్మీబాలుర ఖిల్లా కళాశాల ప్రిన్సిపాల్ కాలిక్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కు ముందు, పరీక్షలు జరుగుతున్నపుడు, పరీక్ష పూర్తైన తర్వాత చేపట్టాల్సిన చర్యలను క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో 36 పరీక్ష కేంద్రాల  చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

https://batukammanews.com/tight-arrangements-for-inter-supplementary-examinations-2/

More articles

Latest article