ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ 22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు నిజామాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (2024-25 విద్యా సంవత్సరం) పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. మే 22వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్ మెంటల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ...