28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు పెంచడాన్నినిరసిస్తూ, స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని, ఇప్పటికే విద్యార్థులకు స్కాలర్ షిప్ లు రాక ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. అయినప్పటికీ ఇంకా ఫీజులను పెంచుతూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, నగర కార్యదర్శి బాలకృష్ణ, యోగేశ్, సిద్దు, హేమంత్, రంజిత్, దుర్గాదాస్, రాజకుమార్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.

Scholarships should be released.

More articles

Latest article