27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 26 మందికి భారీ జరిమానా

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 29 మందిని పట్టుకున్నట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 26 మందికి ఒకరికి 10,000/- చొప్పున 260,000/-జరిమానా విధించారన్నారు. పంగేరా యాదగిరి, గజానంద్ రాజేశ్వర్, ఇందు నవీన్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులకు మాత్రం వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు పేర్కొన్నారు.

More articles

Latest article