27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సెక్స్  వృత్తిని ఈ తరంతో వదిలిపోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భవిష్యత్తు తరాలకు పునరావృతం కాకుండా చూడాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సెక్స్ వృత్తిని తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్నా ఈ తరంతో వదిలి భవిష్యత్తు తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, జిల్లా సంక్షేమ అధికారిని డి.పద్మ అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల స్నేహ సొసైటీ పర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్  వారి టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ జిల్లా  పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, జిల్లా సంక్షేమ అధికారి డి పద్మ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

Sex work should be abandoned with this generation.

 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తప్పని పరిస్థితుల్లో ఈ వృత్తిని ఎంచుకొని తమ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించరాదని సూచించారు. ఈ వృత్తి మీ తరం వరకే ఆగిపోవాలని తెలిపారు. తమ పిల్లలు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే సెక్స్ వర్కర్లకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయన్నారు. మీ హక్కుల కోసం పోలీస్ శాఖ, షీ టీమ్ అందుబాటులో ఉందని తెలిపారు. తమ వద్దకు వచ్చే వారు డ్రగ్స్, గంజాయి, ఇతరత్రా మత్తు పదార్థాలు వాడి రావడం జరుగుతుందని, అటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కొంతమంది తమ వద్దకు వచ్చే వారి పట్ల దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉండడం జరుగుతుందని అలాంటి దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

 

Sex work should be abandoned with this generation.

 

ఈ కార్యక్రమంలో స్నేహ టీ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సిద్దయ్య, జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకులు ఏ పురుషోత్తం, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ. వికాస్, డిపిఎం సుధాకర్, సీపిఓ మొయిజ్ అహ్మద్, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, స్నేహ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు తాటి వీరేశం గుప్తా, ప్రాజెక్ట్ ఆఫీసర్ వయోజన విద్య వెంకటేశ్వరరావు తదితరులు స్నేహ టి ఐ ప్రాజెక్ట్ మేనేజర్ శివ, ఎస్ ఎస్ కె మేనేజర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సేవలు అందించిన సిబ్బంది ని, పీర్ ఎడ్యుకేటర్లను, ఆఫీస్ సిబ్బందిని,  మహిళా సెక్స్ వర్కర్లను సన్మానించారు.

 

Sex work should be abandoned with this generation.

 

More articles

Latest article