25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – సి బి సి ఎస్- బి ఏ./ బీకాం./ బిఎస్సి./ బి బి ఏ./ బి సి ఎ   రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్  (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) పరీక్షలు 12వ రోజు పూర్తయ్యాయని తెలిపారు. ఉదయం  జరిగిన  పరీక్షలకు 6679  మంది విద్యార్థులకు 6153 మంది విద్యార్థులు హాజరయ్యారని,  524 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు  8011 మందివిద్యార్థులకు 7241 మంది విద్యార్థులు హాజరయ్యారని, 769  మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. సి ఎస్ ఐ  డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ లో ఒకరు, ఆర్ కె డిగ్రీ కాలేజ్ కామారెడ్డి లో ఒకరు, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్ లో ఒకరు మొత్తం ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారని  ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

More articles

Latest article