27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ముగ్గురు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కర్రలతో దాడి చేసిన ముగ్గురు నిందితులకు ఆరునెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన యోగేష్ రెడ్డి తన స్నేహితుడు అర్జున్ రెడ్డితో కలిసి ఏప్రిల్ 16,2019న బాసర దర్శనానికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం అర్జున్ రెడ్డి అన్న కుశాల్ రెడ్డి, వారి తండ్రి విఠల్ రెడ్డి ఫిర్యాదుదారుడు అడ్డాల సాయిరెడ్డి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఏప్పిల్ 18,2019న కుశాల్ రెడ్డి, విఠల్ రెడ్డి, హనుమంత్ రెడ్డిలు కలిసి ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి యోగేష్ రెడ్డిని కర్రలతో దాడి చేశారు. ఫిర్యాదు దారుడు అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేశారు. దీంతో బాధితుడు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారుణలో భాగంగా ఇంటివారిని, చుట్టు పక్కల వారిని విచారించారు. విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. కేసులో సాక్ష్యాలను విచారించి కేసు రుజువు కావడంతో బిచ్కుంద జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిందితులకు ఆరునెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించారు. పోలీసుల తరుపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజేష్ గౌడ్, అప్పటి బిచ్కుంద ఎస్ఐ క్రిష్ణ, ప్రస్తుత ఎస్ఐ మోహన్ రెడ్డి, సీడీఓ పవన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

More articles

Latest article