- ఎంపీడీవో అనంతరావు
ఇందల్వాయి,బతుకమ్మ : రాష్ట్రంలోని మారుమూల అటవీ ప్రాంతాలలో జీవనం కొనసాగిస్తున్న బంజారా గిరిజన ప్రజలను ఆర్థికంగా మరింత ఉన్నత స్థానంలో ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకే ప్రతి గ్రామంలో ప్రజా పాలన మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ఇందల్వాయి ఎంపీడీవో అనంతరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఇందల్వాయి మండలంలోని స్కూల్ తండా, గండి తండా గ్రామాలలో గురువారం మండల అభివృద్ధి అధికారి అనంతరావు ఆదేశాల మేరకు ప్రజా పాలన గ్రామసభలను నిర్వహించారు. ఆరు గ్యారంటీలలో భాగంగా ఈనెల 26న ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు చేర్పులు మార్పులు తదితర సంక్షేమ కార్యక్రమాలను జనవరి 26 నుండి అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన గ్రామంలో నెలకొన్న సమస్యలను, వాటికి సంబంధించిన సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో ఆన్లైన్ చేయడం జరిగిందని వివరించారు. ఇట్టి ఆన్లైన్ వివరాలను నేటి గ్రామసభలో ప్రజలకు వివరించడం జరుగుతుందని ఎంపీడీవో అనంతరావు అన్నారు. అర్హులైన జాబితాలో పేర్లు లేని వారు గ్రామ ప్రజల సమక్షంలో గ్రామసభలో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వo వీలు కల్పించిందని ఆయన వివరించారు. స్కూలు తండా, గండి తండా గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరు ప్రజా పాలన సభలో పాల్గొన్న ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కేతవత్ బాబురావు, కేతావత్ సుజాత, బాదావత్ మాల, బాదావత్ దేవ్ సి, మాజీ సర్పంచ్ కుమార్, మాజీ ఎంపిటిసి పాల్తే కిషన్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మారుతి నాయక్, బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మోతిలాల్, గ్రామస్తులు, లబ్ధిదారులు, తండా కారోబార్, నాయక్ సబ్ తదితరులు పాల్గొన్నారు.

