27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీవీఏజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగో రోజు నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీవీఏజేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగి రెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ ని వెంటనే కన్వర్షన్ చేయాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ ని రెగ్యులర్ చేశామని చెప్పి రెగ్యులర్ చేయలేదని, ఆర్టిజన్స్ కి మోసం చేసింది అని అన్నారు. ఆర్టిజన్స్ ని విద్యార్హతలను బట్టి కన్వెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఉపముఖ్యమంత్రి కి ఆర్టిజెన్సీ కన్వర్షన్ చేయాలని వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ఆర్టిజన్స్ విద్యుత్ సంస్థలలో గత 15, 20 సంవత్సరాలు నుండి పనిచేస్తున్నారని తెలిపారు. వీరిని యాజమాన్యం శ్రమ దోపిడి చేస్తుందని ఈ అన్యాయాన్ని సహించేది లేదని, కార్మికులు యూనియన్లకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటలను కొనసాగించాలని కార్మికుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ బట్టు గంగాధర్,  రవి, కిరణ్, మురళి, థామస్, సింగ్,  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article