33.2 C
Hyderabad

ఈసారి ఈడీ వంతు

Must read

📰 Generate e-Paper Clip

  • ఫార్మూలా ఈ కార్ రేస్ సంస్థకు నిధుల మళ్లింపుపై ఈడీ కేసు
  • 24 గంటలలో కేటీఆర్ అండ్ కో పై రెండో కేసు

హైద్రాబాద్, బతుకమ్మ:  భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారాక రామారావు పై 24 గంటలలో రెండో కేసు నమోదైంది. ఈ నెల 19న ఫార్మూలా ఈ కార్ రేస్ నిర్వహించిన సంస్థలకు రూ.55 కోట్ల నిధుల మళ్లింపులో ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పేమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదులోని సమాచారం ప్రకారం విదేశీ సంస్థకు రూ.55 కోట్ల బదలాయింపునకు అనుమతులు లేకుండా, క్యాబినేట్ అమోదం లేకుండా జరిగిన తీరు పై అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ను 10 రోజుల వరకు అరెస్టు చేయవద్దని న్యాయస్థానం తీర్పు వచ్చిన గంటల వ్యవథిలో ఈడి కేసు నమోదు చేయడం గమనార్హం.

More articles

Latest article